News March 7, 2025

సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరం: కలెక్టర్

image

భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం, మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఏరు ఫెస్టివల్ విజయవంతం చేయాలని సూచించారు. ఆన్‌లైన్లో 75%, 25% మాన్యువల్‌గా టికెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

Similar News

News November 3, 2025

ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

image

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.

News November 3, 2025

NGKL: గత ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తిచేయలేకపోయింది: సీఎం

image

గత పదేళ్లలో 10 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తమ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 30 కి.మీ.ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు.

News November 3, 2025

నెల్లూరు జైలుకు జోగి రమేష్‌ తరలింపు

image

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.