News March 7, 2025
నెల్లూరు: ‘అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి’

రైతులు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ అన్నారు. కోవూరు మండలం పాటూరు, ఇనమడుగు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సేవా కేంద్రంలో రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
Similar News
News March 9, 2025
ఉచిత బస్సు తుస్సు.. గ్యాస్ సిలిండర్లు. బుస్సు: కాకాణి

ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయన శనివారం పర్యటించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్రజలు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.
News March 8, 2025
కావలి వైసీపీ నేత సుకుమార్ రెడ్డి సస్పెండ్

కావలి నియోజకవర్గం YCP నేత, కావలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.