News March 7, 2025

రేవంత్‌ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే: KTR

image

కరీంనగర్‌ – నిజామాబాద్‌ – మెదక్‌ – ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే అని ఆరోపించారు.

Similar News

News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

News March 8, 2025

HYD: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య

image

పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్‌లో జరిగింది. బాల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతుంది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.

News March 8, 2025

HYD: ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

image

ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!