News March 7, 2025

పిఠాపురం: నాటి ప్రత్యేర్ధులే నేటి సహచర నాయకులు

image

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సిద్ధాంతాన్ని పోలుస్తూ, పిఠాపురం రాజకీయ పరిణామాలను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రేపు పవన్ సమక్షంలో జనసేనలో చేరునున్న నేపథ్యంలో నాటి ప్రత్యర్థులు నేటి సహచరులుగా మారబోతున్నారు. ఈ క్రమంలో పెండం దొరబాబు గురువారం జనసేన పిఠాపురం నాయకులతో భేటీ అయిన ఫోటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

Similar News

News March 18, 2026

సూర్యాపేట: నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ నేతృత్వంలో నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 18, 2026

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న 87,150 మంది భక్తులు

image

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 87,150 మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. పాదయాత్రతో కైలాస ద్వారం నుంచి 7,095 మంది, అన్నప్రసాద విభాగం ద్వారా 6,232 మంది తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి.

News March 18, 2026

మెదక్-నర్సాపూర్ రహదారిపై ప్రమాదం.. ఇద్దరి మృతి

image

మెదక్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోతంశెట్టిపల్లికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండీ యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరేకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.