News March 7, 2025
NLG: కోర్టులో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

నల్గొండ న్యాయ సేవాధికార సంస్థలో టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి యం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతో పాటు టైపింగ్ హయర్‌లో పాసై, నిమిషానికి 45 పదాలు టైపు వచ్చి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్డులు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం కోర్టు వెబ్ సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
Similar News
News February 25, 2026
ఇంట్లోకి ఉడుము ప్రవేశిస్తే?

ఇంట్లోకి ఉడుము ప్రవేశించడాన్ని ఉపద్రవానికి సూచనగా పరిగణిస్తారు. దీనివల్ల దాచుకున్న సంపద కోల్పోవడం, అనవసర నిందలు, కోర్టు చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పండితులు చెబుతారు. వారి సూచన ప్రకారం.. ఉడుము ఇంట్లోకి వస్తే సురక్షితంగా బయటకు పంపాలి. అనంతరం ఇంటిని శుద్ధి చేసి పుణ్యావచనం చేయించాలి. దోష శాంతి కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాహం నిర్వహిస్తే ఆపదలు తొలగి ఆర్థిక, మానసిక స్థిరత్వం లభిస్తుంది.
News February 25, 2026
జగిత్యాల: బెదిరించాడని కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య!

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారులో ఈనెల 20న విగతజీవిగా పడిఉన్న <<19225309>>ఎర్రోల్ల లింబాద్రి<<>> కేసు మిస్టరీ వీడింది. గతంలో భార్య లక్ష్మి పెట్టిన గృహహింస కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తానని లింబాద్రి బెదిరించడమే హత్యకు దారితీసింది. దీంతో విసిగిపోయిన ఆమె, కుమారుడు లతీఫ్ మరో నలుగురితో కలిసి ఇనుప పైపులతో దాడి చేసి భర్తను హత్యచేసి మృతదేహాన్ని శివారులో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
News February 25, 2026
భూపాలపల్లి: పొలాల్లోకి దూసుకెళ్లి కారు బోల్తా

భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద బుధవారం ఓ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బోర్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి తన కారులో హనుమకొండకు వెళ్తుండగా, కమలాపూర్ శివారులోని మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ప్రయాణికులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.


