News March 7, 2025

నెమలి వాహనంపై విహరించిన చంద్రమౌళీశ్వరుడు

image

ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు. అంతకుముందు చంద్రమౌళీశ్వరస్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

Similar News

News March 7, 2026

ఇంటర్ పరీక్షలకు 577 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక్ తెలిపారు. పరీక్షలకు సెట్-2 ప్రశ్నపత్రాన్ని ఉపయోగించామన్నారు. 6,126 మంది జనరల్ విద్యార్థులలో 5,767 మంది హాజరు కాగా 359 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,178 మందకి గాను 1,960 మంది హాజరు కాగా 218 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు CC కెమెరాల పర్యవేక్షణలో సాగాయన్నారు.

News March 7, 2026

100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు: JDA రవి

image

రబీ 2025-26 సీజన్ ఈ-క్రాప్ సవరణ కోసం ఇది చివరి అవకాశం ఈనెల 16న జరగుతుందని, ఆ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని JDA రవి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు చేశామన్నారు. ఖరీఫ్-2025కు సంబంధించి మన జిల్లాలో ఇప్పటివరకు 100 శాతం సర్వేలో భాగంగా 5,91,938 రైతుల LP నంబర్లలో సర్వే చేశామన్నారు.

News March 7, 2026

రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

image

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా, లేదా అని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మంచి భోదన అందజేయాలన్నారు.