News March 7, 2025

కెరమెరి: గిరిజన సాహస పుత్రిక కన్నిబాయి

image

భీమన్ గొందికి చెందిన మడవి కన్నీబాయి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి సాహస క్రీడల్లో సరికొత్త చరిత్ర లిఖించి ఆదివాసీ ముత్యంగా మెరిసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఆపేశారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో పారాసైలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News March 7, 2025

అనకాపల్లి: క్వారీలపై ఫిర్యాదుల మేరకు విచారణ

image

జిల్లాలోని రాయి క్వారీలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న తనిఖీలపై గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ అశోక్‌కుమార్‌ రాయి క్వారీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో క్వారీల్లో తనిఖీలు జరుపుతున్నామన్నారు. అనుమతి లేని క్వారీలను సీజ్‌ చేసి, అదనంగా తవ్వకాలు జరిపిన క్వారీల నిర్వాహకులకు జరిమానాలు విధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు.

News March 7, 2025

HYD: నగర విస్తరణకు మంత్రివర్గం ఆమోదం

image

HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.

News March 7, 2025

గోకవరం: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

గోకవరం, కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు – బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!