News March 7, 2025
ములుగు: ఇన్‌స్పైర్ అవార్డు ఎంపికైన మధునిత

ములుగు పట్టణానికి చెందిన తీర్థాల రామన్న కూతురు మధునిత 2024-2025 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ యూజింగ్ ప్రదర్శనకు అవార్డు పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన మధునితను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
Similar News
News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
News March 7, 2025
హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్‌ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/ ద్వారా మేం చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపనలకు అర్థంలేదు’ అని ట్వీట్ చేశారు.
News March 7, 2025
ఆర్థికలోటుతోనే తులం బంగారం ఆలస్యం: పొంగులేటి

ఖమ్మం: పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా తులం బంగారం హామీ లేట్ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.