News March 7, 2025
ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు సూచనలు

ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్‌లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
Similar News
News March 7, 2025
ADB: రూ.20లక్షల అప్పు.. అందుకే సూసైడ్!

నేరడిగొండలో <<15670214>>దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్‌కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్‌లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.
News March 7, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదన్నారు.
News March 7, 2025
ADB: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కురిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ADBలో గాలినాణ్యత విలువ 90గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!