News March 7, 2025
జహీరాబాద్‌లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్‌కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.
Similar News
News March 13, 2026
విజయవాడ: అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లల్లో తనిఖీలు

విజయవాడలోని రౌడీషీటర్లపై పోలీసులు నిరంతర నిఘా పెడుతున్నారు. మాచవరం ప్రాంతంలో సీఐ వెంకటరమణ తన సిబ్బందితో గురువారం అర్ధరాత్రి రౌడీ షీటర్లు, అనుమానితుల గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లు తమ తమ ఇళ్లలోనే ఉన్నట్లు గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు తరచుగా కొనసాగుతాయని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
కామారెడ్డి: రేపటి నుంచే పది పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను పటిష్ఠ భద్రతల మధ్య నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా బాలురు 6,451 బాలికలు 6,703 మంది ఉన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9గం.నుంచి 12.30గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ చూపించి పరీక్షా కేంద్రం దగ్గర్లోకి ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు.
News March 13, 2026
పల్నాడు: గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక నంబర్

పల్నాడు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (08647-252999) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.


