News March 7, 2025
మెదక్: విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించిందన్నారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ వృత్తుల్లో ఉన్నవారికి ఈ పథకం ఫలాలు అందాలన్నారు.
Similar News
News July 9, 2025
మెదక్: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు.!

ఓపెన్ స్కూల్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లలకు ఓపెన్ స్కూల్ వరం అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.telanganaopenschool.org/ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News July 8, 2025
మెదక్: 86 శాతం మందికి పంపిణీ

మెదక్ జిల్లాలో మూడు నెలల కోటాకు సంబంధించి బియ్యం పంపిణీ 86 శాతం మంది రేషన్ దారులు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,16,716 కార్డుదారులు ఉండగా, 1,86,578 మంది బియ్యం తీసుకున్నారని డీఎస్‌వో నిత్యానందం తెలిపారు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. మళ్లీ సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.
News July 8, 2025
రామాయంపేట: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ HBT బోధించేందుకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన అభ్యర్థులకు అవకాశం ఉందని, రూ.18,200 వేతనం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.