News March 7, 2025
అల్లు అర్జున్, స్నేహా బంధానికి పద్నాలుగేళ్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ పద్నాలుగో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. 2011లో స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కించబోయే సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు టాక్.
Similar News
News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.
News March 9, 2025
ముంబై జట్టులోకి ఆల్‌రౌండర్

గాయంతో ఐపీఎల్ 2025కు దూరమైన లిజాడ్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. 2014లో U19 WC గెలిచిన సఫారీ టీమ్‌లోని కార్బిన్ బాష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు MI ట్వీట్ చేసింది. కాగా 86 టీ20లు ఆడిన కార్బిన్ 59 వికెట్లు తీయగా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పటికే ముంబై జట్టులో హార్దిక్ పాండ్య, సాంట్నర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు.
News March 9, 2025
సిరియాలో ప్రతీకార దాడులు.. 600 మంది మృతి!

సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో భద్రత దళాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారుల మధ్య ప్రతీకార దాడుల్లో 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇరు వర్గాల మధ్య దాడి మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని తెలిపాయి. వీధుల్లో, భవనాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బనీయాస్ పట్టణంలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించాయి.