News March 7, 2025

సిర్పూర్ (టి): వంతెన పైనుంచి నదిలో పడి వ్యక్తి మృతి

image

మహారాష్ట్రలోని పొడ్స గ్రామం మధ్యలోని నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News March 9, 2025

NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

image

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 9, 2025

ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

image

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్‌లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.

News March 9, 2025

సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.

error: Content is protected !!