News March 7, 2025
NZB: PCPNDT టాస్క్ ఫోర్స్ బృందo తనిఖీలు

NZBలో PCPNDT టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ఈ మేరకు గురువారం మెడికవర్, మనోరమ ఆసుపత్రులను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసినట్లు DMHO డాక్టర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ DMHO వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే స్కానింగ్ చేయాలని ఆమె సూచించారు. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2025
ఎడపల్లి: బావిలో దూకి యువకుడు ఆత్మహత్య

ఎడపల్లి మండలంలోని ఠాణాకలన్ గ్రామానికి చెందిన సురేశ్(24) అనే యువకుడు కుటుంబ కలహాలతో శుక్రవారం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మృతదేహం నీటిపై తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 9, 2025
NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదుతో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News March 9, 2025
NZB: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: ACP

నిర్మల్‌లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, నాందేడ్‌కు చెందిన అమన్, బాసరకు చెందిన షేక్ అర్బాజ్ ముగ్గురు కలిసి NZBలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా అమన్ పరారీలో ఉన్నట్లు ACP వెల్లడించారు.