News March 7, 2025
నాగర్ కర్నూల్: గుర్తు తెలియని మహిళ మృతి

బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ శివారులోని కేఎల్ఐ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గురువారం స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మహిళ ఎవరు? ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News March 10, 2026
ఈ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్: నిర్మల

PMJDYతో సహా 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌కు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. వీటికి మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఫైన్ ఉండదని, డిపాజిట్, విత్‌డ్రా, ATM సేవలకూ ఛార్జీలు ఉండవని తెలిపారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ మేరకు లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు.
News March 10, 2026
NZB: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

NZB జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక జారీ చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వకం లేదా రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం ఇసుక ఆన్లైన్ యాప్ ద్వారానే అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని సూచించారు.
News March 10, 2026
తగ్గనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

AP: రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్, వైన్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వాటి అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించనుంది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒక్కో సీసాపై రూ.3వేల వరకూ తగ్గనున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.


