News March 7, 2025
భీమదేవరపల్లి: న్యాయం కోసం CM వద్దకు పాదయాత్ర

భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం కొడుకు రాజేష్ 2018లో ఓ పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ మృతిచెందాడు. విష ప్రయోగంతో చనిపోయాడని, నిందితులను శిక్షించి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా దశరథం దంపతులు వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు. గురువారం ‘న్యాయం కోసం ముఖ్యమంత్రి’ వద్దకు బ్యానరుతో బయలు దేరారు. రాంనగర్ వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు.
Similar News
News March 21, 2026
HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.
News March 21, 2026
అనంత: స్వగ్రామానికి మాజీ MLA భౌతికకాయం తరలింపు

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
News March 21, 2026
నల్గొండ రోడ్లకు ‘బడ్జెట్’ మొండిచేయి!

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. జిల్లాకు చెందిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, సొంత జిల్లా రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. అధ్వాన్నంగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్గొండ -కొండమల్లేపల్లి వంటి రహదారుల విస్తరణకు నిధుల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


