News March 7, 2025

NRPT: క్రీడల్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

image

ఝార్ఖండ్ రాజధాని రాంచీ లో జరిగిన 68వ అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో నారాయణపేట జిల్లాలో పని చేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ గౌడ్ బాంబు డిస్పోజల్ టీమ్ నుంచి రూమ్ సెర్చింగ్ విభాగంలో ప్రతిభ చూపాడు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ కానిస్టేబుల్‌ను అభినందించి ప్రశంస పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ఐ నరసింహ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 9, 2025

ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

image

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!