News March 7, 2025
గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News March 12, 2026
PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News March 12, 2026
జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.