News March 7, 2025
నేడు మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
Similar News
News March 9, 2025
రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.
News March 9, 2025
శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గిఫ్ట్

నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. విశ్వంభర సెట్స్‌లో ఆయన్ను చూసేందుకు శ్రీలీల వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చిరు ఓ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారు, వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది. శ్రీలీల తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.
News March 9, 2025
GOOD NEWS.. చేనేత కార్మికులకు రుణమాఫీ

TG: చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష వరకు రుణమాఫీ కానుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న లోన్లకు ఇది వర్తించనుంది.