News March 7, 2025
16 ఏళ్లు కలిసుండి రేప్ అంటే ఎలా?: సుప్రీం

16 ఏళ్లపాటు రిలేషన్లో ఉండి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారించింది. ‘16 ఏళ్లపాటు లైంగికదాడి భరించిందంటే నమ్మశక్యంగా లేదు. పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం కొనసాగినట్లు ఉంది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అతడిపై అనుమానం రాలేదా. ఇందులో అత్యాచారం కోణం లేనే లేదు’ అని తీర్పునిచ్చింది.
Similar News
News March 9, 2025
రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.
News March 9, 2025
జడేజా రిటైర్మెంట్?

స్టార్ ఆల్‌రౌండర్ జడేజా CT ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా మ్యాచ్‌లో జడ్డూ స్పెల్ తర్వాత ఆయన్ను విరాట్ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించారు. దీంతో ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్న జడేజా వన్డేల నుంచీ రిటైర్ అవుతారని తెలుస్తోంది. ఇటీవల అశ్విన్, స్మిత్‌ను హగ్ చేసుకున్న తర్వాత వారు రిటైర్ అయ్యారు. అలాగే జడేజా సైతం అస్త్ర సన్యాసం చేస్తారని ఫ్యాన్స్ పోల్చుతున్నారు.
News March 9, 2025
రేపు ఈ మండలాల్లో వడగాలులు

AP: రేపు పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వైరామవరం
పార్వతీపురం మన్యం(D) గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం, ఏలూరు (D) కుకునూర్, వేలేర్పాడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని పేర్కొంది.