News March 7, 2025
నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు

TG: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను అధికారులు ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానున్నారు. https://bse.telangana.gov.in సైట్‌లో విద్యార్థులు లాగిన్ అయి హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 9, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య CT ఫైనల్ జరుగుతోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీంకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు లభిస్తాయి. టోర్నీలో పాల్గొన్నందుకు IND, NZ సహా అన్ని టీంలు $125,000, గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన టీంలు 34,000 డాలర్లు అందుకుంటాయి. 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లకు $350,000, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 లభిస్తాయి.
News March 9, 2025
విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.
News March 9, 2025
ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.