News March 23, 2024

మార్చి 23: చరిత్రలో ఈ రోజు

image

1956: పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సింగర్ విజయ్ ఏసుదాస్ జననం
1987: హీరోయిన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు మరణం
ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం

Similar News

News October 6, 2024

క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే నిలిచిన SAARC: జైశంకర్

image

ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.

News October 6, 2024

ఆరోజు నమ్మకపోతే ‘శివ’,నేనూ ఉండేవాళ్లం కాదు: RGV

image

‘శివ’ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నా లైఫ్‌కి బ్రేక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన మద్దతు, నాపై సంపూర్ణ విశ్వాసం లేకపోతే శివతో పాటు నేనూ ఉండేవాడినికాదు’ అని ట్వీట్ చేశారు. వర్మ తన కెరీర్‌ను ‘శివ’తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

News October 6, 2024

ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.