News March 7, 2025
చందోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట గురువారం చందోలు పోలీసులను ఆశ్రయించింది. పిట్టలవానిపాలెం మండలం పరిసవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 11, 2026
అడవి వదిలి… ఊరి బాట పట్టిన వానరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను వణికిస్తున్నాయి. అడవిని విడిచి ఊర్ల బాట పట్టిన కోతులు, నేరుగా ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద భక్తులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడి ఇప్పుడు అడవిలో ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.


