News March 7, 2025

జగ్గంపేట: మృతిచెందిన యువతి వివరాలు ఇవే..

image

ఏలూరు రోడ్డు ప్రమాదంలో జగ్గంపేటకు చెందిన మిట్టపర్తి భవాని (23) మృతి చెందింది. ఆమె స్వగ్రామం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కాట్రావులపల్లి వస్తుండగా గురువారం తెల్లవారు జామున ప్రమాదంలో మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 9, 2025

సంగారెడ్డి కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 9, 2025

రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.

News March 9, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కొత్తగూడెం: ప్రజాసమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!