News March 7, 2025

WGL: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Similar News

News March 4, 2026

NTR: రూ.38.83 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో కీలక ఫలితాలు సాధించినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆపరేషన్ నార్కోస్ కింద రూ.38.83 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 11 మందిని అరెస్టు చేసి, అధికారులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా రూ.1,65,505ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.

News March 4, 2026

రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

image

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.

News March 4, 2026

వేములవాడ: నేడే అసలైన హోలీ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.