News March 7, 2025
ఆకివీడు: లారీ ఢీకొని యువకుడు మృతి

ఆకివీడు శివారు దుంపగడప గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఏలూరు జిల్లా కొట్టాడ ప్రాంతానికి చెందిన మద్దా మరియదాస్ (20) యువకుడు ఇంటికి వెళ్తుండగా ఆకివీడు వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. మరియదాసు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Similar News
News March 10, 2026
ప.గో: నెల రోజుల పాటు రక్తదాన మహోత్సవం

ప.గో. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు నిధుల సేకరణ చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం రక్తదాన మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో మానవతా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని జేసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News March 9, 2026
భీమవరం: ఆ 10 ఫిర్యాదులపై తక్షణ చర్యలు

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 10 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. అందిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
News March 9, 2026
ప.గో: పుట్టినరోజు వేడుకలు జరగాల్సిన చోట.. విషాద ఛాయలు!

తణుకు మండలం వీరభద్రపురానికి చెందిన ఆకుల ఐశ్వర్య (13) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తణుకు ఎస్సీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఐశ్వర్యను తన పుట్టినరోజైన ఆదివారం తల్లి శాంతి నిడదవోలు తీసుకెళ్లింది. అక్కడ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు శాంతి, ప్రసాద్ మనస్పర్ధలతో విడివిడిగా ఉంటున్నారు. బాలిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


