News March 7, 2025
ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 2019 అక్టోబర్ 15లోగా గృహాలు నిర్మించిన వారు చట్టబద్ధమైన హక్కులు కల్పించుటకు గాను, ప్రభుత్వం (జీవో ఎం ఎస్ నెంబర్30/2025) విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామ వార్డులు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 20, 2026
SKLM: స్వర్ణంతో బియ్యపు గింజంత రథసప్తమి లోగో

రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయించే సూర్యుడుని స్వర్ణంపై ఆవిష్కరించారు పలాస (M) కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి. రథసప్తమి అనే అక్షరాలను ఇందులో పొందిపరిచి ఆకట్టుకుంటున్నారు. ఈ లోగోను ఆదిత్యునికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోగో 100 మిల్లీ గ్రాముల బంగారం రేకుపై 5 గంటలు శ్రమించి తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News January 20, 2026
శ్రీకాకుళం: పక్షి ఈకపై ఆదిత్యుడి చిత్రం

శ్రీకాకుళంలోని జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మకళా చిత్రకారుడు వాడాడ రాహూల్ పక్షి ఈకపై ఆరోగ్య భాస్కరుడు సూర్యనారాయణ స్వామి చిత్రాన్ని గీశారు. రథసప్తమి పండుగ సందర్భంగా రథంపై ఆదిత్యుని చిత్రం గీసినట్లు వెల్లడించారు. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలలో ఒకదానికి అంకితం చేస్తూ ఈ చిత్రాన్ని గీశామన్నారు. ఇది చూపురాలను ఆకట్టుకుంటోంది.
News January 20, 2026
SKLM: తొలి రోజు హెలికాప్టర్ రైడ్‌లో ఎంత మంది విహరించారంటే..

రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను సిక్కోలు వాసులు ఆస్వాదిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన తొలి రోజు దాదాపు 107 మంది హెలికాప్టర్‌లో విహరించగా రూ.2,43,400 వసూలయ్యాయి. హెలికాప్టర్ రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.


