News March 7, 2025
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
Similar News
News September 14, 2025
ప్రతి ఒక విద్యార్థి మొక్క నాటి సంరక్షించాలి: అదనపు కలెక్టర్

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం జరిగే ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో అన్ని పాఠశాలల్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, దానితో సెల్ఫీ దిగి, ఆ ఫొటోను https://ecoclubs.education.gov.in/main పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు.
News September 14, 2025
గద్వాల్ జిల్లా కోసం చేసిన ధర్నాలు, పోరాటాలు వైరల్

నడిగడ్డలోని ప్రజాపాలకులు కలిసి పోరాటం చేయడంతోనే గద్వాల జిల్లా ప్రత్యేక జిల్లాగా అయిందని, ఇందులో BRS పార్టీ చేసింది ఏమీలేదని అప్పటి ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. నిన్న తేరు మైదానం సభలో గద్వాల్‌ను జిల్లాగా చేశామని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా గద్వాల్ జిల్లా కోసం చేపట్టిన నిరసనలు, ధర్నాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజాపాలకులు అందరూ కలిసి పోరాటం చేస్తే జిల్లా అవతరించిందన్నారు.
News September 14, 2025
కృష్ణా జిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!

33 ఏళ్ల వయసులోనే 4 జిల్లాల్లో SPగా విధులు నిర్వహించి ప్రజాదరణ పొందిన యువ ఐపీఎస్ వానస విద్యాసాగర్ నాయుడు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. నరసాపురానికి చెందిన ఆయన కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. “మన ఊరు మన పోలీస్” వంటి వినూత్న కార్యక్రమాలతో క్రైమ్ రేటు తగ్గించి, రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా SPగా ఆయన విధులు నిర్వహించనున్నారు.