News March 7, 2025

MHBD: పోలీస్ స్టేషన్లో మందు పార్టీ..!

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News January 23, 2026

జగన్ ఖాతాకు శ్రీలంక VPN.. ‘X’ ఏం చెబుతోందంటే?

image

AP: వైసీపీ అధినేత జగన్ తన ‘X(ట్విటర్)’ ఖాతాకు శ్రీలంక VPN(వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌) వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన హ్యాండిల్‌లో ‘Account based in Sri Lanka’ అని చూపిస్తోందని నెటిజన్లు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. అయితే ఈ డేటా కచ్చితమైనది కాకపోవచ్చని, ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్లకు తెలియకుండానే VPN వంటి ప్రాక్సీలను ఉపయోగించవచ్చని ‘X’ చెబుతోంది.

News January 23, 2026

కాకినాడ: దంపతులు ఆత్మహత్యాయత్నం

image

పిఠాపురం(M) మల్లం గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతికి పుట్టింటికి వెళ్లేముందు ఓ వివాహిత తన డ్వాక్రా డబ్బులను భర్తకు ఇచ్చింది. తిరిగి వచ్చాక ఆ డబ్బులు అడగగా, ఖర్చయిపోయాయని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే భర్త కూడా అదే మందు తాగాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

News January 23, 2026

ASF: నేడు జూనియర్ కళాశాలల్లో ‘మెగా పేరెంట్స్ మీటింగ్’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు DIEO రాందాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలల్లో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పరీక్షల ఫలితాలు, కళాశాలల్లో మౌలిక వసతులపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.