News March 7, 2025
సీతానగరం : కారు ఆపి దాడి.. ఇద్దరికి జైలు

రాజంపేట వద్ద 2022 FEB 6న కారును నిలిపి అందులోని వారిపై సీతానగరం(M) మునికూడలి వాసులు కర్రలతో దాడి చేశారు. ఈ మేరకు తీగిరెడ్డి ప్రసాద్, దాసరి జానకిరామ్‌కు గురువారం శిక్ష పడింది. రాజమండ్రి సెవెంత్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 5,500 జరిమానా, 3 నెలలు జైలు శిక్ష విధించారని సీతానగరం ఎస్సై రామ్ కుమార్ తెలిపారు. కోర్టులో హాజరు పరిచిన కానిస్టేబుల్ షరీఫ్‌ను సీఐ సత్య కిశోర్ అభినందించారు.
Similar News
News November 5, 2025
రాజమండ్రి: సాయిబాబా శత జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ చేకూరి కీర్తికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఉత్సవాలకు ప్రధాని మోదీతో హాజరవుతున్నారని తెలిపారు. కలెక్టర్ తప్పనిసరిగా విచ్చేయాలని వారు కోరారు.
News November 5, 2025
రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.
News November 5, 2025
మైనారిటీలకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ: సునీల్

రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ ఉమ్మడి తూ.గో జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు ఎం.సునీల్ కుమార్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఏపీ టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విజయవాడ భవానిపురంలోని CEDM Office, ఫోన్: 0866-2970567 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.


