News March 7, 2025
పెద్దపల్లి: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News March 11, 2026
పోలవరం: పులి దాడిలో మరణించిన పశువులకు నష్టపరిహారం ఎంతో తెలుసా..?

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించి పశువులపై దాడి చేసి చంపుతుండడం తెలిసిందే. అయితే పులి దాడిలో మృతి చెందిన ప్రతి జంతువులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆవు, గేదె, తదితర పశువులకు రూ.15వేలు, అదే దూడలు అయితే రూ.5వేలు నష్టపరిహారం ఇచ్చేలా అధికారులు నిర్ణయించారు.
News March 11, 2026
నెల్లూరు: meesho- ఉమెన్స్ డే గిఫ్ట్ పేరుతో లింకు వైరల్

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 11, 2026
నపుంసకత్వాన్ని దాచి పెళ్లి.. భర్తపై కేసు

నపుంసకత్వాన్ని దాచి వివాహం చేసుకున్న భర్త, అత్తమామలపై నవవధువు విజయవాడలోని గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలకు చెందిన యువతికి కడప యువకుడితో గతేడాది వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త సంసారానికి దూరంగా ఉంటూ వేధించడంతో నిలదీశారు. ఈ క్రమంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ జరిగింది. నపుంసకత్వం విషయాన్ని ఎవరికైనా చెబితే చంపెస్తామని వధువును భర్త, అత్తమామలు బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.


