News March 7, 2025

పెద్దపల్లి: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు

image

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News March 3, 2026

ముఖ్యమంత్రి సదస్సులో కరీంనగర్ కలెక్టర్

image

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.

News March 2, 2026

హోలీ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం

image

రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని KNR జిల్లా ప్రజలకు సీపీ గౌష్ ఆలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సౌహార్దానికి, సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో పలు సూచనలు జారీ చేశారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడాలని సూచించారు.

News March 2, 2026

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

image

హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని తెలిపారు.