News March 7, 2025
అక్కయ్యపాలెం: నకిలీ రైల్వే ఉద్యోగి అరెస్టు

నకిలీ రైల్వే ఉద్యోగితో ఇబ్బందులు పడ్డ బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా సోంబాబును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డీఆర్ఎం ఆఫీస్‌లో ఏసీ, టీవీలు తక్కువ ధరకు ఇప్పిస్తానని అక్కయ్యపాలెం ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, ఎలమంచిలి, దువ్వాడ ప్రాంతాల్లో కొందరిని మోసం చేశాడు. లోకో పైలట్ ఎంప్లాయ్ అని నకిలీ ఐడీ చూపించేవాడు. టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
News March 14, 2026
మధురవాడలో కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి

మధురవాడ ఆర్టీసీ కాలనీ సాయిప్రియ నివాస్ సమీపంలో స్వతంత్రనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కుమ్మరపు రవి (41) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం ఉదయం పొదల్లో మృతదేహమై కనిపించారు. వాంబే కాలనీ వద్ద కారు నిలిపి, నడుచుకుంటూ వచ్చి అక్కడ పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రవి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


