News March 7, 2025

శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడి మృతి

image

వైసీపీ సీనియర్ నేత, కొయ్యూరు మండలం శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు లోకుల సోమగాంధీ శుక్రవారం ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మరణించారని కుటుంబీకులు తెలిపారు. శరభన్నపాలెం గ్రామానికి చెందిన సోమ గాంధీ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News March 12, 2026

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

image

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

News March 12, 2026

GWL: పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163.. ఎస్పీ శ్రీనివాసరావు

image

ఈనెల13 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి గూడాటాన్ని నిషేధించామన్నారు. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.

News March 12, 2026

ప.గో: డ్రోన్ల వినియోగం భేష్‌.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస

image

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.