News March 7, 2025
కోదాడ: పరీక్ష సరిగా రాయలేకపోయానని ఆత్మహత్య

పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నానని ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకుంది. కుటుంబీకుల వివరాలు.. కోదాడ పరిధిలోని కొమరబండకు చెందిన నవ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాగా, కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెంది గురువారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి మృతిచెందింది. కేసు నమోదైంది.
Similar News
News March 11, 2026
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా..?

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇప్పటికే స్పీకర్ ఇరువురి వాదనలు విని, తన తీర్పును ఈరోజుకు వాయిదా వేశారు. గత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియోలను స్పీకర్‌కు ప్రతివాదులు అందజేశారు. కడియం శ్రీహరిపై నమోదైన అనర్హత పిటిషన్‌ను ఇప్పటికే విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తన తీర్పును ఈరోజు ఉదయం 10 గంటలకు వెలువరించనున్నారు.
News March 11, 2026
శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 11, 2026
కలెక్టర్ల సదస్సుకు వెళ్లిన విజయ కృష్ణన్

అమరావతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు పాటు నిర్వహించనున్న సదస్సులో కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. జిల్లాకు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న మౌలిక వసతులపై నివేదిక సమర్పిస్తారు.


