News March 7, 2025

ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది. జులై 7న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, మిగతా వారికి రూ.750గా నిర్ణయించారు.

Similar News

News April 6, 2026

సీజ్‌ఫైర్‌ను తిరస్కరించిన ఇరాన్.. ట్రంప్ వార్నింగ్!

image

సీజ్‌ఫైర్‌పై పాకిస్థాన్ ద్వారా US పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 10 కండిషన్లు పెట్టింది. ఒక్క సీజ్‌ఫైర్‌తో సరిపెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. హార్ముజ్‌పై తమ కంట్రోల్‌కు గుర్తింపు, ఆంక్షలు ఎత్తివేత, నష్టపరిహారం మొదలైనవి డిమాండ్లుగా పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

News April 6, 2026

3 మ్యాచుల్లో వివాదాలు.. బీసీసీఐకి SRH ఫిర్యాదు?

image

RCB, KKR, LSGతో మ్యాచుల సందర్భంగా జరిగిన పరిణామాలపై SRH బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. క్లాసెన్ క్యాచ్‌ను సాల్ట్, అభిషేక్ క్యాచ్‌ను వరుణ్ బంతి నేలను తాకాక పట్టుకొన్నట్లు కనిపిస్తున్నా ఔటివ్వడంపై యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. అలాగే నిన్న పంత్ కొట్టిన బాల్ బౌండరీ లైన్ దాటకముందే అవేశ్ బ్యాటుతో లోపలికి కొట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సన్ రైజర్స్ కోరనున్నట్లు <<19577513>>తెలుస్తోంది.<<>>

News April 6, 2026

‘చర్చకు సిద్ధం’.. విజయన్‌కు రేవంత్ కౌంటర్

image

TG: రాష్ట్ర పాలనపై కేరళం CM పినరయి <<19557717>>విజయన్<<>> చేసిన ట్వీట్లపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ లేఖ ద్వారా బదులిచ్చారు. విజయన్ పేర్కొన్న గణాంకాలన్నీ BRS హయాంలోనివని (2023-24) వివరిస్తూ ఆరు పేజీల లేఖ రాశారు. 28నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్ర GSDP గ్రోత్ (10.1%) జాతీయ సగటు (9.9%) కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. APR 7న తిరువనంతపురం వచ్చి గణాంకాలతో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.