News March 7, 2025

గద్వాలలో బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ

image

గద్వాల జిల్లా కేంద్రంలోని రాజా వీధిలో బంగారు వ్యాపారి సంజీవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు సంజీవ్ కథనం ప్రకారం వివరాలు.. గురువారం ఉదయం తమ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 7 తులాల బంగారము 5.1/4 కేజీల వెండి, రూ.1 లక్ష 30 వేల నగదు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్ఐ కళ్యాణ్ చేరుకొని వేలు ముద్ర ఆధారాలు స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 19, 2026

శ్రీ సత్యసాయి: తండ్రి మృతి.. కన్నీళ్లు దిగమింగుకొని పరీక్షకు హాజరు!

image

బత్తలపల్లి(M) గంటాపురంలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి రెడ్డప్పను కోల్పోయిన పదో తరగతి విద్యార్థి సిద్ధార్థ.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. తండ్రి కలలను నెరవేర్చడమే నిజమైన నివాళి అని భావించి, విషాద వాతావరణంలోనే పరీక్ష రాశాడు. ‘బాగా చదివి నాన్న ఆశయం నెరవేర్చుతా’ అన్న అతని మాటలు అక్కడున్న వారిని కదిలించాయి. బాలుడి పట్టుదల అందరికీ ఆదర్శం.

News March 19, 2026

VJA: బ్లడ్ క్యాన్సర్‌తో ASI గోపి మృతి?

image

పటమట PSలో ASIగా పనిచేస్తున్న గోపి మృతిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్న క్రమంలోనే మృతి చెందారని ఆయన కుమారుడు శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తరచూ కళ్లు తిరిగి పడిపోయేవారని, ఈ క్రమంలోనే పెద్దపులిపాక కట్ట వద్ద ప్రాణాలు కోల్పోయారన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

image

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.