News March 7, 2025

HYD: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

image

ఈనెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఉ.11 నుంచి ప్రారంభంకానున్నాయి.

Similar News

News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 1, 2026

RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, ⁠మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.

News December 31, 2025

HYD: వినూత్నంగా సజ్జనార్ న్యూ ఇయర్ విషెస్

image

న్యూ ఇయర్ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే మద్యం బాబులకు హితవు పలికారు. పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్లో 35 దాటితే బుక్కయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఒక ఏడాదే వృథా అవుతుంది కానీ డ్రైవింగ్‌లో తేడా కొడితే జీవితమే ఆగం అవుతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా, జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.