News March 7, 2025
నెల్లూరు: DSC అభ్యర్థులకు GOOD NEWS

రానున్న మెగా DSC పరీక్షకు ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా BC వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు, బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసువాలని తెలిపారు. ఇతర వివరాలకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.
Similar News
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.
News March 7, 2026
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.


