News March 7, 2025
HYD: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఇవాళ ఉ.11 నుంచి ప్రారంభంకానుంది.
Similar News
News December 30, 2025
HYD: ASBL ఫ్యామిలీ డే 2025

ASBL ఫ్యామిలీ డే 2025.. ASBL ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చింది. ఇది నమ్మకం, ఉమ్మడి విలువలు, సామూహిక అభివృద్ధికై జరుపుకున్న వేడుక. వ్యవస్థాపకులు, CEO అజితేష్ కొరుపోలు గతం, భవిష్యత్తు గురించి మనస్ఫూర్తిగా, ఆత్మీయంగా వారి భావాలను పంచుకున్నారు. ఈ వేడుక ఒక నమ్మకాన్ని బలపరిచిందన్నారు. ASBL కేవలం ప్రాజెక్టులపై మాత్రమే కాదు, నమ్మకంపై నిర్మించబడిందని అజితేష్ కొరుపోలు అన్నారు.
News December 30, 2025
IMA నుంచి తొలి మహిళా ఆఫీసర్

డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్‌లు పాసవుట్ పరేడ్ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది సాయి జాదవ్.
News December 30, 2025
జగిత్యాల అభ్యర్థులకు ఖమ్మంలో EXAM CENTER

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు దరఖాస్తు చేసుకున్న జగిత్యాల జిల్లా అభ్యర్థులకు దూర ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సమీప జిల్లాల్లో కాకుండా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంలో పరీక్షా కేంద్రాలు అలాటవ్వడం అన్యాయమన్నారు. మహిళలకు మరింత ఇబ్బందులు తలెత్తనున్నాయని అన్నారు.


