News March 7, 2025
రామభద్రపురం: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

రామభద్రపురం మండలం తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ప్రసాద్ వర్మ(42) మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగోపాల్, ప్రసాద్ వర్మ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా వారికి ముందు వెళ్లుతున్న బైక్ స్లో కావడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ మృతి చెందినట్లు SI ప్రసాద్ తెలిపారు.
Similar News
News March 17, 2026
విజయనగరంలో నేడు జాబ్ మేళా

విజయనగరంలోని మహారాజా కాలేజ్‌లో ఈ నెల 17 ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, కెమిస్టు, అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి సుమారు 250 ఖాళీలు భర్తీ చేయనున్నాయని, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులన్నారు. అభ్యర్థులకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్డు తప్పనిసరి అని సూచించారు.
News March 17, 2026
ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.
News March 17, 2026
VZM: ‘మార్చి 28 వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయి’

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల 28 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లాలోని 367 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సుమారు రూ.974 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.


