News March 23, 2024

త్వరలో భారత్-భూటాన్ మధ్య రైలు సేవలు!

image

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్-భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్‌లో నూతన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది. అస్సాంలోని కోక్రాజర్, బెంగాల్‌లోని బనర్‌హట్ నుంచి భూటాన్‌కు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. 2019-2024 మధ్య రూ.5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న ఐదేళ్లకు దానిని డబుల్ (రూ.10వేలకోట్లు) చేసింది.

Similar News

News October 2, 2024

MUDA SCAM: బాపూజీ ధైర్యమిస్తున్నాడన్న సిద్దరామయ్య

image

ముడా స్కామ్, ED నోటీసులు, లోకాయుక్త కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బాపూ జీవితం, ఆయన ఆలోచనలే తనకు ధైర్యం ఇస్తున్నాయని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మతతత్వం, నియంతృత్వం, హింసతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ, సత్య స్వరూపం, శాంతి, అహింసే మన చేతిపట్టి నడిపిస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఆయనపై లోకాయుక్త FIR, ఈడీ ECIR రిజిస్టర్ చేయడం తెలిసిందే.

News October 2, 2024

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం: సురేఖ

image

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.

News October 2, 2024

ICC నం.1 టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. 870 పాయింట్స్‌తో బుమ్రా నం.1 టెస్టు బౌలర్‌గా నిలిచారు. ఇప్పటివరకు నం.1గా ఉన్న అశ్విన్ రెండో స్థానానికి పడిపోయారు. అశ్విన్ కూడా బంగ్లాతో టెస్టు సిరీస్‌లో 11 వికెట్లు తీయడం గమనార్హం.