News March 7, 2025
గజ్వేల్: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా బోధన చేసేందుకు ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. నిఖత్ అంజుమ్ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 50% మార్కులు ఉండాలన్నారు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 15, 2026
వచ్చే నెలలో సూర్యగ్రహణం.. భారత్‌లో నో ఎఫెక్ట్!

వచ్చే నెల 17(మంగళవారం)న సూర్యగ్రహణం సంభవించనుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పేర్కొంటున్నారు. భారత కాలమాన ప్రకారం సా.5.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మనదగ్గర కనిపించదు. అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో చూడవచ్చు. మన దేశంలో కనిపించే అవకాశం లేకపోవడంతో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
News January 15, 2026
‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా తిరుపతి

తిరుపతిని ‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నగరంలోని అవిలాల, పేరూరు చెరువులతో పాటు అన్ని చెరువుల సుందరీకరణతో పాటు అలిపిరి సమీపంలో 20–25 ఎకరాల్లో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను ప్రోత్సహించి, విశాఖపట్నం, అమరావతి తరహాలో తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
News January 15, 2026
NLG: 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికిల్స్ పాస్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గింది. సంక్రాంతికి ముందు పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలుండగా ప్రస్తుతం అవి బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఈ ప్లాజాల గుండా సుమారు 3.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఇందులో ఒక్క విజయవాడ వైపు వెళ్లినవే 2.04 లక్షల వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


