News March 7, 2025
కాకినాడ : చాలా ఘోరం కదా..?

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.
Similar News
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.
News July 6, 2025
వ్యాసాశ్రమంలో దశాబ్దాల తర్వాత కలిశారు..!

ఏర్పేడు(M) వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. 1965 నుంచి 2000వ సంవత్సరం వరకు చదవిన దాదాపు 150 మంది రావడంతో అందరిలోనూ సంతోషం నెలకొంది. ఇక్కడ చదివిన తామంతా ఉన్నతస్థాయికి చేరామని, ఇదంతా మలయాళస్వామి కృపేనని పేర్కొన్నారు. ఏర్పేడులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరూ వ్యాసాశ్రమంలో చదివారా? బ్యాచ్ పేరుతో కామెంట్ చేయండి.
News July 6, 2025
రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన

వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహించారు. షో నిలిపి వేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.