News March 7, 2025
కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 4, 2025
హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
News November 4, 2025
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
News November 4, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.


