News March 7, 2025

ASF: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఆసిఫాబాద్‌లో గాలినాణ్యత విలువ 80గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News July 6, 2025

HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్‌ గురించి తెలుసా..!

image

బీబీ కా ఆలం హైదరాబాద్‌లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్‌ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ 2,368 పాఠశాలు, 140 జూనియర్ కాలేజీల్లో చదివే 2,90,545 మంది విద్యార్థులు, కాలేజీలోని 35,920 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పిల్లలతో అమ్మ పేరుపై  లక్షా 64 వేల 170 మొక్కలను నాటిస్తామన్నారు.

News July 6, 2025

VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

image

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్ట‌మ్స్‌, టూల్స్ ప్రొఫిష‌య‌న్సీ, ఫైలింగ్‌‌ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.