News March 7, 2025

HYD: రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

HYDలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10.5 డిగ్రీలకు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 12.5, హయత్‌నగర్‌లో 17, దుండిగల్‌లో 16.1 నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా.. మధ్యాహ్నం వీపు పగిలేట్లు 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం.

Similar News

News March 14, 2026

భూపాలపల్లి: ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 122 పాఠశాలలకు చెందిన 3,544 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించగా, 9:30 గంటలకు ప్రశ్నపత్రాలను అందజేశారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

News March 14, 2026

NGKL: విద్యార్థుల కోసం ఆర్టీసీ ‘SSC హెల్ప్ డెస్క్’

image

NGKL జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు శనివారం ‘SSC Help Desk’ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల వేళలు, రూట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఇక్కడ తెలియజేయవచ్చని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 14, 2026

NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

image

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.