News March 7, 2025

NLG: సూసైడ్.. ముగ్గురు అరెస్ట్

image

వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. ఆగామోత్కూర్‌కు చెందిన వెంకన్నతో సరితకు పెళ్లైంది. వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీనులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Similar News

News March 4, 2026

NLG: అంగన్వాడీలకు ఇక వెలుగులు

image

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

News March 4, 2026

NLG: భానుడి భగభగ.. గిర్రున తిరుగుతున్న మీటర్లు

image

NLG జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు ముదురుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకాన్ని పెంచేశారు. దీంతో గృహ వినియోగ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వినియోగం గణనీయంగా పెరగ్గా, ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో వినియోగదారులు విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలంటున్నారు.

News March 3, 2026

NLG: ‘పాలనలో వేగం పెంచాలి’.. కలెక్టర్ల సదస్సులో CM

image

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత కీలకంగా సాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ పాల్గొని జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ​ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని CM ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.