News March 23, 2024
నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని MYS స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
Similar News
News January 9, 2025
మావోయిస్టులపై మరోసారి పోలీస్ పంజా
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News January 9, 2025
సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.
News January 9, 2025
బిగ్‌బాస్ 18కు చాహల్, శ్రేయస్ అయ్యర్?
బిగ్ బాస్ 18లో టీమ్ ఇండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్‌తోపాటు శశాంక్ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సండే ఈవెంట్‌లో వీరు సందడి చేస్తారని సమాచారం. వీరు ముగ్గురూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ధనశ్రీ, చాహల్ విడాకులకు శ్రేయస్ అయ్యర్ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆసక్తిగా మారింది.