News March 7, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు విజయవాడ నుంచి ఎక్కువగా పెనమలూరు, గన్నవరం తదితర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మంత్రి ప్రకటన మేరకు గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరుకు వెళ్లాలంటే మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా..?

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇప్పటికే స్పీకర్ ఇరువురి వాదనలు విని, తన తీర్పును ఈరోజుకు వాయిదా వేశారు. గత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియోలను స్పీకర్‌కు ప్రతివాదులు అందజేశారు. కడియం శ్రీహరిపై నమోదైన అనర్హత పిటిషన్‌ను ఇప్పటికే విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తన తీర్పును ఈరోజు ఉదయం 10 గంటలకు వెలువరించనున్నారు.
News March 11, 2026
శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 11, 2026
కలెక్టర్ల సదస్సుకు వెళ్లిన విజయ కృష్ణన్

అమరావతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు పాటు నిర్వహించనున్న సదస్సులో కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. జిల్లాకు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న మౌలిక వసతులపై నివేదిక సమర్పిస్తారు.


